రెండో విడత ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి ఆధ్వర్యంలో ప్రక్రియ
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 7 నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మిర్యాలగూడ డివిజన్‌లో విధులు నిర్వహించనున్న పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆదివారం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టగా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షించారు. ఉన్నతాధికారుల పాల్గొనడం ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జీ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, డీఈవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని మండలాల్లో...