కారంపూడి మండలంలో 15 వేల సంతకాల మైలురాయి కోటిసంతకాల ఉద్యమానికి విశేష స్పందన — మండల వైసీపీ నేతల వెల్లడి

కారంపూడి, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 8 ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “కోటిసంతకాల సేకరణ కార్యక్రమం” కారంపూడి మండలంలో ఘన విజయం సాధించిందని మండల పార్టీ అధ్యక్షులు కొంగర సుబ్రహ్మణ్యం, యువజన విభాగం అధ్యక్షులు చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో నేతల ప్రకటన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంతకాల సేకరణకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఫలితంగా కారంపూడి మండలంలో 15,000 సంతకాలు సేకరించడం జరిగిందని వెల్లడించారు. ప్రజల నుంచి అంచనాలకు మించిన స్పందన...