లాల్ లక్ష్మీపురంలో కాంగ్రెస్‌లో చేరికలతో రాజకీయ వేడి
నేరేడుచర్ల, డిసెంబర్ 10 (డైనమిక్ న్యూస్): నేరేడుచర్ల మండలం పరిధిలో కొత్తగా ఏర్పాటు అయిన లాల్ లక్ష్మీపురం గ్రామంలో మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం గ్రామ రాజకీయాల్లో ఆసక్తిని రేపింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేరికలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనంతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట్ రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పి అధికారికంగా...