ఎన్నికల బందోబస్తు విధుల్లో అప్రమత్తత, క్రమశిక్షణ తప్పనిసరి జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో సిబ్బందికి మార్గదర్శనం
డైనమిక్ న్యూస్, సూర్యాపేట బ్యూరో, డిసెంబర్ 10 డిసెంబర్ 11న జిల్లాలో జరగనున్న మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల బందోబస్తు విధుల్లో నియమితులైన పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తత, క్రమశిక్షణతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశించారు. సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ సూర్యాపేట మండల పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న పోలీసు సిబ్బందికి పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్‌లో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, విధుల నిర్వహణపై కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసు శాఖ పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం అనుమతించబడదు విధుల నిర్వహణలో...