నల్లగొండ జిల్లాలో ప్రశాంతంగా తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 11 జిల్లాలో జరుగుతున్న తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా పోలీసు శాఖ వెల్లడించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు మంచి సంఖ్యలో హాజరవుతున్నారు. అవాంఛనీయ పరిస్థితులను అరికట్టేందుకు పటిష్ట బందోబస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ, సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు సిబ్బందిని మోహరించి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే ఎవరి పట్లనైనా కఠిన చర్యలు...