మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలపై జిల్లా యంత్రాంగం కఠిన పర్యవేక్షణ కలెక్టర్ కార్యాలయంలో నియంత్రణ గది ద్వారా నిరంతర మానిటరింగ్
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11 మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో జరుగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నియంత్రణ గదిలో ఏర్పాటు చేసిన సీసీటీవీల ద్వారా పోలింగ్ కేంద్రాల పరిస్థితులను పర్యవేక్షించారు.సమస్యాత్మక కేంద్రాలను ముందస్తుగా గుర్తించిన జిల్లా యంత్రాంగం అక్కడ వెబ్‌కాస్టింగ్‌ను అమలు చేసింది. అవసరమైన కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించారు. ఉదయం 7 గంటల నుంచే ప్రత్యక్ష పర్యవేక్షణ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వెంటనే నియంత్రణ గదిలోని ప్రత్యేక బృందం వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాల పరిస్థితులను పరిశీలిస్తూ కలెక్టర్‌కు మరియు గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ...