పోస్ట్ ఆఫీస్ బజార్లో ప్రజాబాట కార్యక్రమం

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11 నేరేడుచర్ల టౌన్‌లోని పోస్ట్ ఆఫీస్ బజార్ ప్రాంతంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. అధికారుల పర్యవేక్షణలో కార్యక్రమం ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ ఆపరేషన్స్ డివిజన్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ నాగిరెడ్డి, నేరేడుచర్ల ఏఈ సృజనతో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ సమస్యల స్వీకరణ – పరిష్కారానికి చర్యలు స్థానిక ప్రజల నుంచి వచ్చిన విద్యుత్ సమస్యలను స్వీకరించి, పరిష్కారానికి అవసరమైన సూచనలు అధికారులతో నే అందించారు. వినియోగదారులకు భద్రత, సేవల అందుబాటు గురించి వివరించారు.