నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో ‘విశ్వ మానవ ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన’ దినోత్సవంచట్టాలపై అవగాహన అత్యంత అవసరం : భీమార్జున్ రెడ్డీ

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్ డిసెంబర్ 12 నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో “విశ్వ మానవ ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన” దినోత్సవం సందర్భంగా, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ భీమార్జున్ రెడ్డి అధ్యక్షతన అవగాహన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్షరాస్యత ఎంత అవసరమో చట్టాలపై అవగాహన (లీగల్ లిట్రసి) కూడా ప్రతి పౌరుడికి అంతే ముఖ్యం అని తెలిపారు. చట్టాలపై అవగాహన ఉంటేనే మనిషి సమాజంలో ఆత్మగౌరవంతో జీవిస్తూ, తన హక్కులను కాపాడుకుంటూ, అన్యాయానికి గురికాకుండా నిలబడగలడని అన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుందని, అవసరమైన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్యం...