పారదర్శకంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి– జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి

నల్గొండ బ్యూరో , డైనమిక్ న్యూస్,13 డిసెంబర్ రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో ఆదివారం జరగనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం మాడుగులపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ (డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్) కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించి, స్టేజ్–2 అధికారులతో మాట్లాడారు. పోలింగ్, కౌంటింగ్‌లో నిర్లక్ష్యానికి తావులేదు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపును కూడా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని...