ప్రశాంతంగా కొనసాగుతున్న రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ పవార్

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 14 నల్లగొండ జిల్లాలో ఆదివారం జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా పరిశీలించి పర్యవేక్షించారు. 163 BNSS (144 సెక్షన్) అమలు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 163 BNSS (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా గుమికూడరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు పోలింగ్ నిర్వహణకు లేదా శాంతిభద్రతలకు...