దేవరకొండ డివిజన్‌లో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు 2206 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 15 గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడవ విడతగా నిర్వహించనున్న దేవరకొండ డివిజన్ పరిధిలోని మండలాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మీ సమక్షంలో జరిగింది. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తి ఈ నెల 11, 14 తేదీలలో నల్గొండ, చండూరు, మిర్యాలగూడ డివిజన్లలో రెండు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 17న దేవరకొండ డివిజన్‌లో పోలింగ్ ఈ నెల 17న దేవరకొండ డివిజన్ పరిధిలోని చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి,...