మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్లక్ష్యం సహించం ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 16 మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడైనా నిర్లక్ష్యం కనబడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ మంగళవారం మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న దేవరకొండ డివిజన్ పరిధిలోని రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీవో, డీపీఓ, జెడ్పీ సీఈఓలతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. గత విడతల్లో ఎదురైన లోపాలు పునరావృతం కావద్దు మొదటి, రెండవ...