అమలాపురంలో డాక్టర్ హనుమానాయక్‌కు ఉత్తమ ఫిజి యోథెరపిస్ట్ అవార్డు పల్నాడు జిల్లా రెమిడిచర్ల యువ వైద్యుడికి అరుదైన గౌరవం

గురజాల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 16 పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలం రెమిడిచర్ల గ్రామానికి చెందిన డాక్టర్ హనుమానాయక్‌కు ఉత్తమ ఫిజియోథెరపిస్ట్ అవార్డు లభించింది. అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ ఫిజియో వార్షిక పరిశోధన–సాంస్కృతిక సమావేశంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. లేజర్ ఫిజియోథెరపీలో విశేష సేవలు ప్రస్తుతం అంబాజీపేట పెద్దవీధిలోని శ్రీ లక్ష్మి అడ్వాన్స్ లేజర్ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ హనుమానాయక్, ఆధునిక లేజర్ ఫిజియోథెరపి ద్వారా అనేకమందికి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నారు. రోగుల వేగవంతమైన కోలికలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. పదేళ్లుగా నిరంతర వైద్య...