రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలిజిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నల్లగొండలో నిర్వహణ – విశేష స్పందన
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 20 ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. రక్తదానం ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతీక్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదలకు ఉపయోగపడే రక్తసేకరణ శిబిరంలో సేకరించిన రక్తం అత్యవసర...