రామానుజన్ జయంతి సందర్భంగా మండలస్థాయి గణిత ప్రతిభా పోటీలు
నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 20 తెలంగాణా గణిత ఫోరం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని శనివారం నేరేడు చర్ల మండలస్థాయి గణిత ప్రతిభా పోటీ పరీక్షలు నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదానం ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు చేతుల మీదుగా అందజేశారు. రామానుజన్ ఆదర్శంగా తీసుకోవాలి ప్రధానోపాధ్యాయులు బట్టు మధుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ బాల్యంనుంచే గణితంపై ప్రత్యేక మక్కువ పెంచుకుని గణిత శాస్త్రవేత్తగా ఎదిగి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినగణిత మేధావి”గా నిలిచారని తెలిపారు.విద్యార్థులు రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకుని గణితంలో...