కొత్త సర్పంచ్ బాధ్యతల నేపథ్యంలో గ్రామ పంచాయతీ భవనాలకు రంగుల హంగు

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 21 రేపటి నుంచి బాధ్యతలు చేపట్టనున్న నూతన సర్పంచులు – గ్రామాల్లో పరిపాలనా కదలికమండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం నుంచి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో చురుకుదనం కనిపిస్తోంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనాలకు కొత్తగా రంగులు వేయడం, పరిసరాలను శుభ్రం చేయడం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పరిపాలనకు ఆరంభ సంకేతంగా పంచాయతీ భవనాల సుందరీకరణ సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టే ముందు గ్రామ పంచాయతీ భవనాలు ఆకర్షణీయంగా కనిపించేలా రంగులు వేయడం, గోడల మరమ్మత్తులు చేయడం ద్వారా గ్రామ పాలనకు ఒక నూతన ఆరంభానికి సంకేతంగా...