లాల్ లక్ష్మీపురం పంచాయతీ ఎన్నికల్లో చంద్రగిరి పర్వతం ఘన విజయం 5వ వార్డులో 48 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపు

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 22 నేరేడు చర్ల మండల పరిధిలో తాజాగా ఏర్పాటు అయిన లాల్ లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో నిర్వహించిన వార్డు సభ్యుల ఎన్నికల్లో ప్రజాస్వామ్య పండుగ ఘనంగా జరిగింది. ఇందులో 5వ వార్డుకు చెందిన చంద్రగిరి పర్వతం 48 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించి స్థానిక రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రజల నమ్మకానికి ప్రతీకగా ఓటర్ల తీర్పు ఎన్నికల సమయంలో ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో పాటు, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు వచ్చిన చంద్రగిరి పర్వతానికి ఓటర్లు భారీ మద్దతు తెలిపారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలు ఓటర్లను ఆకర్షించినట్లు తెలుస్తోంది....