ఈ నెల 24న పండుగ వాతావరణంలో మాచర్ల అభివృద్ధికి శ్రీకారంరూ.26 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

డైనమిక్ న్యూస్,మాచర్ల , డిసెంబర్ 22 మాచర్ల నియోజకవర్గంలో ఈ నెల 24న పండుగ వాతావరణంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు శాసన సభ్యుల కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ.26.48 కోట్ల నిధులతో సిద్ధమైన పలు నిర్మాణ పనులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం రెంటచింతల మండల కేంద్రంలో రూ.4.23 కోట్లతో నూతనంగా నిర్మించనున్న గిరిజన సంక్షేమ పాఠశాల భవన నిర్మాణ పనులకు ఈ నెల 24న శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మాచర్ల పట్టణ పరిధిలోని పీడబ్ల్యూడీ కాలనీలో రూ.1.80 కోట్లతో నిర్మించనున్న గిరిజన సంక్షేమ...