చిల్లేపల్లి గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సర్పంచ్‌గా కోడిద అపర్ణ–మనోజ్‌కుమార్, ఉపసర్పంచ్‌గా బోరి గొర్ల సైదులు బాధ్యతలు స్వీకరణ
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 22 చిల్లేపల్లి గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు పది మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్‌గా కోడిద అపర్ణ–మనోజ్‌కుమార్ ప్రమాణం గ్రామ సర్పంచ్‌గా కోడిద అపర్ణ–మనోజ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఉపసర్పంచ్‌గా బోరి గొర్ల సైదులు బాధ్యతలు ఉపసర్పంచ్‌గా బోరి గొర్ల సైదులు ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. సర్పంచ్‌తో...