కల్లూరు గ్రామ పాలనలో కొనసాగుతున్న చలసాని కుటుంబ సేవా వారసత్వం గతంలో పతి ఎంపీటీసీగా – ఇప్పుడు సతి గ్రామ సర్పంచ్గా బాధ్యతలు
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 22 నేరేడు చర్ల మండల పరిధిలోని కల్లూరు గ్రామ పాలనలో ప్రజాసేవకు చలసాని కుటుంబం మరోసారి నాంది పలికింది. గతంలో చలసాని శ్రీనివాస్ రావు ఎంపీటీసీగా గ్రామం మరియు మండల స్థాయి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగా, ప్రస్తుతం ఆయన సతి చలసాని మంజుల శ్రీనివాస్ రావు గ్రామ పంచాయతీ సర్పంచ్గా సోమవారం నాడు అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఎంపీటీసీ అనుభవం నుంచి సర్పంచ్ బాధ్యతల వరకూ చలసాని శ్రీనివాస్ రావు ఎంపీటీసీగా పనిచేసిన సమయంలో గ్రామ సమస్యలను నేరుగా ప్రభుత్వ స్థాయికి తీసుకెళ్లడంలో చురుకుగా వ్యవహరించారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో...