ఉపకార వేతనాల కోసం ధ్రువపత్రాల జారీకి వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు
నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 23 విద్యార్థులు ఉపకార వేతనాలు సకాలంలో పొందేందుకు తహసిల్దార్లు ఎలాంటి జాప్యం లేకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె సూచించారు. ఈ మేరకు ఆర్డీఓ, డీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కనగల్‌లో ఆకస్మిక తనిఖీలు మంగళవారం నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రి-మెట్రిక్ ఉపకార...