తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్‌కు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం
డైనమిక్ న్యూస్,కారంపూడి,డిసెంబర్23 పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తహసీల్దార్ ఆర్. వెంకటేశ్వర్లు నాయక్‌ను జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. రక్తదానానికి ప్రాధాన్యం – కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణలో రక్తదాన శిబిరాల నిర్వహణ ఎంతో కీలకమని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు సామాజిక బాధ్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం మరింత చేరువ కావడానికి ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. రెవెన్యూ సిబ్బంది సహకారం రక్తదాన శిబిరం నిర్వహణలో...