మిషన్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలుముఖ్య అతిథిగా మండల విద్యాధికారి ఏ. రాజేంద్రప్రసాద్ పాల్గొనడం

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 23 కేతపల్లి మండలంలోని బీమవరం గ్రామంలో ఉన్న మిషన్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ముందస్తు క్రిస్మస్ (సెమీ క్రిస్మస్) వేడుకలను మంగళవారం స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యేసు జన్మ విశ్వ మానవాళికి ఆశాకిరణం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి ఏ. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, రెండువేల సంవత్సరాల క్రితం డిసెంబర్ 24 అర్థరాత్రి అనంతరం యేసుక్రీస్తు జన్మించారని, ఆయన జన్మను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రేమ, శాంతి సందేశమే క్రిస్మస్ సారాంశం ప్రపంచ ప్రజల పాప పరిహారం కొరకు యేసు...