అణగారిన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగారంగాకు ఘన నివాళులర్పించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్.

డైనమిక్ న్యూస్,గుంటూరు, డిసెంబర్ 26 రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన వంగవీటి రంగా ప్రజాదరణ పొందిన నేత అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అహమ్మద్ పేర్కొన్నారు. వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా శుక్రవారం గుంటూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ పాల్గొన్నారు. తొలుత గుంటూరు తూర్పు శాసనసభ్యుల కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.విగ్రహాలకు పూలమాలలు, అన్నదాన కార్యక్రమంఅనంతరం నెహ్రూనగర్, శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాదవబజారులో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి హాజరై స్వయంగా...