తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సాముల రామిరెడ్డి పోటీ ఈనెల 29న అట్టహాసంగా నామినేషన్…ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు తరలిరావాలని పిలుపు
నేరేడుచర్ల , డైనమిక్ న్యూస్,డిసెంబర్ 27 జనవరి 30న జరగనున్న తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి సభ్యుడిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఈనెల 29న హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలో ఆయన అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. రెండు దశాబ్దాల సేవా ప్రస్థానం గత రెండు దశాబ్దాలుగా హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాముల రామిరెడ్డి, న్యాయవాదుల సంక్షేమం కోసం అనేక కీలక కార్యక్రమాలు చేపట్టారు. హుజూర్నగర్ కోర్టు అభివృద్ధికి సుమారు మూడు కోట్ల రూపాయల నిధులు సమకూర్చి, ఆధునిక కోర్టు సముదాయాన్ని నిర్మింపజేయడంలో కీలక పాత్ర పోషించారు. కోర్టుల విస్తరణకు నిరంతర కృషి...