నూతన సంవత్సర వేడుకల్లో నియమాలు తప్పనిసరి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్పీ కె. నరసింహ
డైనమిక్ న్యూస్ / సూర్యాపేట బ్యూరో, డిసెంబర్ 29 నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ సోమవారం ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాయంత్రం 6 గంటల నుంచే వాహనాల తనిఖీలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌లు, క్లబ్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో...