న్యాయవాదుల హక్కుల కోసం పోరాటం చేస్తా: రోహిత్ పాల్ సింగ్
హైదరాబాద్, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 29 సీనియర్ అడ్వకేట్ రోహిత్ పాల్ సింగ్ తెలంగాణ అడ్వకేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదుల హక్కుల కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. జనవరి 30న జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తన ఛాంబర్‌లో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. యువ న్యాయవాదుల సమస్యలపై దృష్టి రోహిత్ పాల్ సింగ్ మాట్లాడుతూ, కొత్తగా వృత్తిలో అడుగుపెట్టిన జూనియర్ అడ్వొకేట్స్ తక్కువ సంపాదనతో జీవించాల్సి వస్తోందని, వారి కనీస అవసరాలు తీరే విధంగా వేతనం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి న్యాయవాదికి మొదటి ఐదేళ్లకు రూ.10,000 గౌరవ వేతనం అందేలా ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. న్యాయవాదుల సంక్షేమం,...