అధికారులు స్పందించకుంటే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే జూలకంటి హెచ్చరిక ప్రజాదర్బార్‌లో ప్రజల అర్జీల స్వీకరణ

మాచర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 3 ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మాచర్ల పట్టణంలోని నెహ్రూనగర్ టీడీపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. 30కి పైగా అర్జీల స్వీకరణ ఈ ప్రజాదర్బార్‌లో భూ సమస్యలు, పట్టాదారు పాసు పుస్తకాలు, భూ కబ్జాలు, నూతన పింఛన్లకు సంబంధించిన దాదాపు 30 అర్జీలను ప్రజలు ఎమ్మెల్యేకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే జూలకంటి వెంటనే సంబంధిత శాఖాధికారులకు ఫోన్ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం తగదు ఈ సందర్భంగా ఎమ్మెల్యే...