సైబర్ వారియర్స్‌కు ప్రశంసా పత్రాలు డీజీపీ చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసలు

సూర్యాపేట బ్యూరో, జనవరి 6 (డైనమిక్ న్యూస్) సైబర్ నేరాల నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచిన సూర్యాపేట జిల్లా పోలీస్ సైబర్ వారియర్స్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ అదనపు డీజీ షికా గోయల్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. సైబర్ నేరాల పరిష్కారంలో ప్రతిభ సైబర్ మోసాలకు గురైన బాధితుల నగదును తిరిగి వారి ఖాతాల్లో జమ చేయడం, కేసులను త్వరితగతిన ఛేదించడం, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రతిభ...