జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం అని ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 6 జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టణ పోలీసులు, ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ కోర్టు చౌరస్తా, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్ జంక్షన్ వరకు కొనసాగింది. మానవహారంతో సందేశం ర్యాలీ అనంతరం కొత్త బస్టాండ్ ప్రాంగణంలో విద్యార్థులు మానవహారం నిర్వహించి పౌరులు, వాహనదారులకు రోడ్డు భద్రతపై వినూత్న...