వ్యవసాయంలో సంస్కరణలే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

మాచర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 6 సమగ్ర సంస్కరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మండల పరిధిలోని జమ్మలమడక గ్రామంలో నిర్వహించిన రాజముద్రతో కూడిన నూతన పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులకు నూతన పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ ఈ సందర్భంగా నూతనంగా ప్రింట్ చేసిన పట్టదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే స్వయంగా రైతులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వ పాలనలో రాజముద్ర పేరుతో రాజసం, దోపిడీ స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే ప్రచారానికే అధిక ప్రాధాన్యం...