దొంగతనాల నివారణకు జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ అలవాటైన నేరస్తులకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కఠిన హెచ్చరిక
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 7 జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో పెరుగుతున్న దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు, ఇళ్లలో చోరీల వంటి నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలవాటైన నేరస్తులకు కౌన్సిలింగ్ జిల్లాలో గతంలో దొంగతనాలకు పాల్పడిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులందరినీ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి హాజరు పరచి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. నేరాలకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో చట్టబద్ధమైన జీవితం గడపాలని...