సంక్రాంతి సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి ఇంటికి తాళం వేసి వెళ్లే వారు భద్రతా చర్యలు తప్పనిసరి24 గంటల పోలీస్ పెట్రోలింగ్ – పటిష్ట బందోబస్తు ప్రజల సహకారంతోనే నేర రహిత జిల్లా— జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 8 రానున్న సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జిల్లా ప్రజలు స్వగ్రామాలు, ఇతర పట్టణాలు మరియు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఇళ్లకు తాళం వేసి వెళ్లే వారు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగల నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా 24 గంటల పాటు నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రద్దీ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలు, అపార్ట్మెంట్లు, కాలనీలు, ప్రభుత్వ–ప్రైవేట్ భవనాలు, ఆర్థిక సంస్థల వద్ద ప్రత్యేక పోలీస్ నిఘా ఏర్పాటు...