స్వామి వివేకానంద ఆలోచనలు యువతకు దిక్సూచి – కలెక్టర్ తేజస్ పవార్ సూర్యాపేటలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

సూర్యాపేట బ్యూరో, జనవరి 12 (డైనమిక్ న్యూస్): భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచ నలుమూలల చాటిచెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. “లేవండి… మేల్కొనండి…” నేటి యువతకు మార్గదర్శనం కలెక్టర్ మాట్లాడుతూ“లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి” అన్న స్వామి వివేకానంద పిలుపు నేటి తరం యువతకు దిక్సూచిలా మారాలని పేర్కొన్నారు. విదేశాల్లోనూ భారతదేశ ఔన్నత్యాన్ని...