ఆర్‌టీసీ, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన Arrive Alive – Road Safety Campaign–2026’లో భాగంగా నల్గొండలో సదస్సు

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 13 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా చేపట్టిన “Arrive Alive – Road Safety Campaign–2026” కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఆర్‌టీసీ, ఆటో డ్రైవర్లకు విస్తృత రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ జి. రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మానవ తప్పిదాలే ప్రమాదాలకు ప్రధాన కారణం సదస్సులో అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరగడానికి మానవ తప్పిదాలే కారణమని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, సీట్‌బెల్ట్, హెల్మెట్ వాడకపోవడం వంటి కారణాలతో...