కనుమ రోజు కాకి కనిపించడం – మారుతున్న కాలానికి ప్రతీకనా?
డైనమిక్ డెస్క్,డైనమిక్ న్యూస్, జనవరి 16 పెద్దల నానుడి – నేటి వాస్తవం కనుమ పండుగ రోజున కాకి కూడా బయటకు రాదని పెద్దలు చెబుతూ వచ్చిన నానుడి గ్రామీణ సంస్కృతిలో బలంగా నిలిచిపోయింది. పశుపక్షాదులకూ పండుగ విశ్రాంతి ఉండాలన్న భావనతో పాటు, ప్రకృతి సైతం ఒక ప్రత్యేక నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తుందని ఆ నమ్మకం వెనుక భావనగా భావించేవారు. అయితే, కాలం మారుతున్న కొద్దీ ఈ ఆచారాలు, నమ్మకాలు క్రమంగా చెదిరిపోతున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కనుమ రోజున కనిపించిన కాకి నేరేడు చర్ల పట్టణంలో కనుమ పండుగ రోజున కాకి బయట తిరుగుతూ కనిపించడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. “కనుమ రోజు కాకి కనిపించదు”...