రోడ్డు భద్రత పట్ల ఉద్యోగులు పౌరులను ప్రభావితం చేయాలి అరైవ్ ఎలైవ్ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ పిలుపు

సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 16 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత మహోత్సవాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘అరైవ్ ఎలైవ్’ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ మున్సిపల్ కార్యాలయంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు, సూర్యాపేట పట్టణ మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది. రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరం – డీఎస్పీ ఈ సందర్భంగా సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక...