విదేశాల్లో చదువు, ఉద్యోగాల పేరుతో మోసం అంతర్ రాష్ట్ర నిందితుడి అరెస్టు– అడిషనల్ ఎస్పీ జి. రమేష్ వెల్లడి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 16 విదేశాల్లో ఉన్నత చదువులు, అక్కడే మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుడిని చింతపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ జి. రమేష్ తెలిపారు. నిందితుని వివరాలు అరెస్టు అయిన నిందితుడు ముప్పాళ్ల లీలా కృష్ణ (తండ్రి: వెంకట్రావు), వయస్సు 35 సంవత్సరాలు, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి. ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన మోసం నల్లగొండ జిల్లా పోలేపల్లి రాంనగర్‌కు చెందిన కోయల కార్ కరుణభాయ్ ఇచ్చిన ఫిర్యాదు...