అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధుడు లాల్ లక్ష్మీపురంలో నిరుపేద దంపతుల దయనీయ స్థితి

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 17 నేరేడు చర్ల మండల పరిధిలోని నూతన గ్రామ పంచాయతీ లాల్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన కటికోల పున్నయ్య–సీతమ్మ అనే నిరుపేద వృద్ధ దంపతుల జీవితంలో అనుకోని అనారోగ్యం తీవ్ర కష్టాలను తెచ్చిపెట్టింది. పున్నయ్యకు కాలులో తీవ్ర ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. లేవలేని పరిస్థితిలో పున్నయ్య కాలుకు వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా పున్నయ్య నడవలేని, లేవలేని స్థితికి చేరుకున్నారు. రోజువారీ కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగించే ఈ కుటుంబానికి అనారోగ్యం పెద్ద భారంగా మారింది. “రెక్కాడితే కానీ డొక్కాడని” పరిస్థితిలో ఉన్న పున్నయ్యకు వైద్య చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు...