ప్రజావాణి పిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలి అన్ని శాఖలు డీడీఓ బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలి– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట బ్యూరో, జనవరి 19, డైనమిక్ న్యూస్ ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వేగంగా పరిష్కరించాలని సూచించారు. సమీకృత కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి సంబంధించి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక పర్యవేక్షణ కొన్ని శాఖల్లో ప్రజావాణి దరఖాస్తులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని...