అంగరంగ వైభవంగా జానపహాడ్ దర్గాఉర్సు ఉత్సవాలు ప్రారంభం

పాలకవీడు, జనవరి22,డైనమిక్ న్యూస్ నమ్మిన భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తూ దినదినాబివృద్ది చెందుతూ సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల మండలానికి20కిమీ ,పాలకవీడు మండల కేంద్రానికి 10కిమీ దూరాన ఉన్న జాన్‌పహాడ్ దర్గా ఉమ్మడి నల్గొండజిల్లాలోనే గాక, రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు పేరున్న దర్గా గా ప్రసిద్ది చెందింది. ఈనెల 22,23,24తేదీలలో ఉర్సు ఉత్సవాలు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆద్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. పక్క రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ఉర్సు ఉత్సవాలకు తరలి వస్తుంటారు. ఈదర్గా ముస్లింలకు పవిత్ర స్ధలమైనప్పటికీ హిందువులే అధిక సంఖ్యలే దర్శించుకున్నారు. భక్తులు తమ కోర్కెలు తీరితే కందూరు పేరిట మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేని వారు...