బాధితుడి వద్దకే వెళ్లి ఫిర్యాదు నమోదుCitizen / Victim Centric Policingకు నిదర్శనంగా కనగల్ పోలీసులు

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 22 బాధితులు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయలేని ప్రత్యేక పరిస్థితుల్లో, వారి వద్దకే వెళ్లి న్యాయం అందించే తెలంగాణ పోలీస్ శాఖ Citizen / Victim Centric Policing విధానానికి కనగల్ పోలీసులు మరోసారి సార్థకత చాటారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదనపురం గ్రామానికి చెందిన బొల్లిగొర్ల గురువయ్య ఇటీవల జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, నల్లగొండలోని సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది. ఎస్పీ ఆదేశాలతో తక్షణ స్పందన ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్...