మాసాయిపేటలో నూతన సర్పంచులు–అధికారుల పరిచయ వేదిక గ్రామాభివృద్ధికి సమన్వయమే కీలకం : ఎంపీడీవో విగ్నేశ్వర్
డైనమిక్ న్యూస్, మాసాయిపేట, జనవరి 23 మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు, నూతనంగా ఎన్నికైన సర్పంచుల మధ్య పరిచయ వేదిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రైతు వేదికలో నిర్వహించారు. సమన్వయంతోనే గ్రామాభివృద్ధి ఈ సందర్భంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు మరియు అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచ్–అధికారుల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా పని చేయాలనే ఉద్దేశంతోనే ఈ పరిచయ వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్పంచుల పాత్ర కీలకం గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, అధికారుల సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని...