సూర్యాపేట ఎస్పీ నరసింహ చేత డైనమిక్ న్యూస్ నూతన క్యాలెండర్ ఘన ఆవిష్కరణ
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 24 అతి తక్కువ కాలంలోనే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుని, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న డైనమిక్ న్యూస్ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఘనంగా ఆవిష్కరించారు. ప్రశ్నించే ధైర్యమే డైనమిక్ న్యూస్ బలం – జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ,ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించే ధైర్యం డైనమిక్ న్యూస్ ప్రత్యేకత అని స్పష్టం చేశారు. అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందుతూ, సామాన్యుడి సమస్యలను నేరుగా పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రజా సమస్యలపై...