పోలీస్ ఫిట్‌గా ఉంటేనే సమాజం ఫిట్‌ – సూర్యాపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం 600 మందికి పైగా పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు

సూర్యాపేట బ్యూరో, జనవరి 24, డైనమిక్ న్యూస్ పోలీసు సిబ్బంది ఆరోగ్యమే సమాజ ఆరోగ్యానికి పునాది అని చాటి చెబుతూ, సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ నరసింహ సంయుక్తంగా ప్రారంభించారు. కలెక్టర్ చేతుల మీదుగా శిబిర ప్రారంభం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని కలెక్టర్, ఎస్పీలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం, సూర్యాపేట పట్టణానికి చెందిన...