డైనమిక్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ – నిజాయితీ జర్నలిజానికి రాజకీయ వేదికపై ఘన గుర్తింపు
హుజూర్‌నగర్, డైనమిక్ న్యూస్, జనవరీ 25 ప్రజా సమస్యలే అజెండాగా, నిజమే ఆయుధంగా ముందుకు సాగుతున్న డైనమిక్ న్యూస్ పత్రిక మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. హుజూర్‌నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు శానం పూడి సైదిరెడ్డి డైనమిక్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన పత్రిక నిర్వహణకు అభినందనలు తెలియజేస్తూ, డైనమిక్ న్యూస్ ప్రజల గొంతుకగా నిలుస్తోందని కొనియాడారు. సమాజానికి సేవే లక్ష్యంగా జర్నలిజం డైనమిక్ న్యూస్ పత్రిక లాభాపేక్షకు కాకుండా సేవాభావంతో పనిచేస్తోందని శానం పూడి సైదిరెడ్డి అన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజల సమస్యలను ఎక్కడా దాచకుండా నిస్సంకోచంగా వెలుగులోకి...