77వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ‘డైనమిక్ న్యూస్’ క్యాలెండర్ ఆవిష్కరణనేరేడు చర్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రవీందర్ చేతుల మీదుగా ఆవిష్కరణ
డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల | జనవరి 26 దేశభక్తి, కర్తవ్యనిష్ఠ, రాజ్యాంగ విలువల స్ఫూర్తిని చాటుతూ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేరేడు చర్ల మండల పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వార్తాపత్రిక డైనమిక్ న్యూస్ 2026 సంవత్సర క్యాలెండర్‌ను ఎస్‌ఐ రవీందర్ అధికారికంగా ఆవిష్కరించారు. డైనమిక్ న్యూస్ సేవలను ప్రశంసించిన ఎస్‌ఐ డైనమిక్ న్యూస్ పత్రిక ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, సమాజంలో అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఎస్‌ఐ రవీందర్ ప్రశంసించారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర మీడియా వ్యవస్థ ఎంతో ముఖ్యమని, నిజాయితీగల వార్తలే ప్రజలకు సరైన దారి చూపుతాయని ఆయన పేర్కొన్నారు. 🇮🇳...