6 కేజీల గంజాయి స్వాధీనం – ఆరుగురు అరెస్ట్రామస్వామి గట్టు వద్ద డ్రగ్స్ దందాకు చెక్వివరాలు వెల్లడించిన సీఐ చరమందరాజు
డైనమిక్ న్యూస్, హుజూర్నగర్, జనవరి 28 హుజూర్నగర్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలోని రామస్వామి గట్టు ప్రాంతంలో గంజాయి విక్రయం జరుగుతున్నట్లు అందిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నమ్మదగిన సమాచారంతో దాడులు అందిన సమాచారం ఆధారంగా ఎస్సై మోహన్‌బాబు, సిబ్బందితో కలిసి రామస్వామి గట్టుకు వెళ్లి మంగళవారం మాటు వేశారు. అక్కడ గంజాయి విక్రయానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులు ఈ కేసులో వీరమల్ల ఉపేందర్, కాస జయంత్ కెన్ని, సాముల ప్రతాప్‌రెడ్డి, చిల్ల...