సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో వేటపాలెం ఉపాధ్యాయురాలి సత్తా స్పెషల్ ఇన్నోవేటివ్ అవార్డు సాధించిన బత్తుల నీలిమ పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం
బాపట్ల, డైనమిక్ న్యూస్, జనవరి 28 విద్యార్థుల్లో విజ్ఞానపిపాసను పెంపొందిస్తూ, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తున్న వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు బత్తుల నీలిమ సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ పోటీలలో స్పెషల్ ఇన్నోవేటివ్ అవార్డు సాధించడం గ్రామానికి గర్వకారణమని పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు అన్నారు.ఈ సందర్భంగా బుధవారం పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో నీలిమను ఘనంగా సత్కరించారు. రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్సెస్ విభాగంలో వినూత్న ఆవిష్కరణతో అవార్డు సాధించి, హైదరాబాద్ వేదికగా తెలంగాణ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం ద్వారా ఆమె గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు....