అత్యాధునిక పద్ధతితో అరుదైన వ్యాధికి చికిత్స ఆపరేషన్ లేకుండానే అకాలేసియా కార్డియా బాధితురాలికి ఉపశమనంమలకపేట యశోద ఆసుపత్రి వైద్య బృందం మరో ఘన విజయం
డైనమిక్ న్యూస్, జనవరి 29,సూర్యాపేట ఆహారం మింగలేని అరుదైన వ్యాధి అయిన అకాలేసియా కార్డియాతో బాధపడుతున్న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన 63 ఏళ్ల మహిళకు మలకపేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ లేకుండానే అత్యాధునిక చికిత్స అందించి విజయవంతంగా కోలుకునేలా చేశారు. మహిళకు దీర్ఘకాలంగా తీవ్ర సమస్యలు గత కొంతకాలంగా ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బందులు, ఛాతీలో నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళ యశోద ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక ఎండోస్కోపిక్ పరీక్షలు నిర్వహించగా ఆమెకు టైప్–1 అకాలేసియా కార్డియాగా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. పి.ఒ.ఇ.ఎమ్ విధానంతో విజయవంతమైన చికిత్స మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్...